: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఢిల్లీ హైకోర్టు నోటీసు


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఢిల్లీ హైకోర్టు నోటీసు ఇచ్చింది. ఎయిమ్స్ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై వివరణ కోరుతూ న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఎయిమ్స్ లో అవినీతి జరుగుతోందన్న విషయాన్ని అవినీతి వ్యతిరేక అధికారి సంజీవ్ చతుర్వేది కొన్ని నెలల కిందట లేవనెత్తారు. దాంతో ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న ఆయనను గతేడాది ఆగస్టులో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హర్ష వర్ధన్ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడైన ప్రశాంత్ భూషణ్ పిల్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News