: సల్మాన్ ఖాన్ అక్రమ ఆయుధ కేసులో తీర్పు నేడే


పదహారేళ్ల కిందట బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింక (అక్రమ ఆయుధ)లను వేటాడిన కేసులో నేడు జోధ్ పూర్ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఈరోజు కోర్టుకు హాజరుకానున్నారు. అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసింది. ఈ నెల 5న వాదనలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నేడు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో సల్మాన్ పై నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడవచ్చని, అంతేగాక వెంటనే బెయిల్ కూడా దొరకదని సమాచారం.

  • Loading...

More Telugu News