: ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన భారత సైన్యం
పాకిస్థాన్ గడ్డ మీద నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ, మన దేశంలో అలజడి సృష్టించేందుకు పలు ఉగ్రవాద సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో, మన దేశంలోకి చొరబడేందుకు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో చోటు చేసుకుంది. చొరబాటు సందర్భంగా భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో, మన జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు.