: ఏనుగుల బెడదను తప్పించండి: ఏపీ సీఎంకు కుప్పం ప్రజల విజ్ఞప్తి, అధికారులపై ఫిర్యాదు
నిత్యం ఏనుగుల సంచారంతో బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న కుప్పం నియోకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆశ్రయించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబును నేటి ఉదయం కలిసిన ప్రజలు ఏనుగుల బీభత్సంపై పూర్తి వివరాలను ఆయన ముందుంచారు. అడవుల్లో తిరగాల్సిన ఏనుగులు తమ పంటపొలాలపైనే కాక ఆవాసాలపైనా దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల బీభత్సాన్ని నివారించేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టకపోవడమే కాక సకాలంలో స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు.