: సుదీప్ తో ‘అతిలోక సుందరి’ లిప్ లాక్... తమిళ చిత్రంపై జోరుగా ప్రచారం


ఇంగ్లీష్-వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్సును ఘనంగా ప్రారంభించిన ‘అతిలోక సుందరి’ శ్రీదేవి ఈసారి కుర్రకారు హీరోయిన్ లను మైమరపించనుంది. తమిళ చిత్రంలో రాణిగా నటిస్తున్న ఆమె, కన్నడ నటుడు సుదీప్(‘ఈగ’ ఫేమ్)తో లిప్ లాక్ ముద్దుసీనులో పాల్గొందట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. 'ఇళయదళపతి' విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'పులి' చిత్రంలో శ్రీదేవి రాణిగా నటిస్తోంది. ఆమెకు జోడీగా రాజు పాత్రలో సుదీప్ నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు చిత్రానికే హైలైట్ గా నిలవనున్నాయని సమాచారం. చిత్రంలో విజయ్ సరసన హన్సిక, శృతిహాసన్ లు నటిస్తుండగా, వారిద్దరి కంటే శ్రీదేవి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటోందని తెలుస్తోంది. లిప్ లాక్ ల నేపథ్యంలో శ్రీదేవికి భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News