: ఈ అందాలతార తన మొదటి సినిమాను ఇంతవరకు చూడనేలేదట!


అప్పుడెప్పుడో వచ్చిన 'ఆషికీ' చిత్రంతో యువతను ఉర్రూతలూగించిన అనూ అగర్వాల్... ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిన కూడా 'తిరుడా తిరుడా' (తెలుగలో 'దొంగ దొంగ') సినిమాలో మంచి పాత్రను పోషించింది. కాగా, తన తొలి చిత్రం 'ఆషికీ'ని అనూ అగర్వాల్ ఇంతవరకు చూడనేలేదట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం! సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా, దర్శకుడు మహేశ్ భట్ బలవంతంపై 'ఆషికీ'లో నటించిందట అమ్మడు. ఆ సినిమా చేసి ఇక మళ్లీ కెమెరా ముఖం చూడకూడదని భావించినా, అది సాధ్యం కాలేదట. ఓ ఎంటర్ టైన్ మెంట్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూ ఈ వివరాలు తెలిపింది. ఆ సినిమా చూడాలని యోచిస్తున్నట్టు చెప్పింది. రాహుల్ రాయ్ హీరోగా వచ్చిన 'ఆషికీ' చిత్రం అప్పట్లో కుర్రకారుకు ప్రేమ గిలిగింతలు పెట్టింది. అందులో పాటలు సూపర్ హిట్టయ్యాయి.

  • Loading...

More Telugu News