: నైజీరియాలో విధ్వంసం సృష్టిస్తున్న బాలికలు!


నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ విధ్వంసం సృష్టిస్తోంది. అందుకు బాలికలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటోంది! వారికి ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ ఇచ్చి దాడులకు పాల్పడుతోంది! తాజాగా, నైజీరియాలోని దమతురు పట్టణంలోని ఓ బస్ స్టేషన్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 53 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం... పట్టణంలోని తషాన్ డాన్ బోర్నో బస్ స్టేషన్ కు రిక్షాలో వచ్చిన ఓ టీనేజి బాలిక బస్సు ఎక్కుతూ శరీరానికి అమర్చుకున్న బాంబును పేల్చడంతో విస్ఫోటనం సంభవించింది. ఆదివారం నాడు పోటిస్కమ్ పట్టణంలో పదేళ్ల బాలిక ఆత్మాహుతి దాడికి పాల్పడగా, ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు తమ పనే అని ఎవరూ ప్రకటనలు చేయకున్నా, బోకో హరామ్ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News