: ఇక రైళ్లలోనూ పిజ్జా రుచులు


ఇకపై దేశంలోని రైళ్లలో పిజ్జాలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు డోమినోస్ పిజ్జా మాతృసంస్థ జుబిలియెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ తో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణికుల ఆర్డర్ మేరకు తర్వాతి స్టేషన్లో పిజ్జా అందిస్తారు. ఫోన్ కాల్, లేదా, ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. తద్వారా సీటు వద్దకే వేడివేడి పిజ్జా వచ్చేస్తుంది. తొలి దశలో ఢిల్లీ, జైపూర్ స్టేషన్లలో ఈ సేవలు అందిస్తారు. మొత్తమ్మీద, ఎంపిక చేసిన 12 ప్రధాన రైల్వే స్టేషన్లలో పిజ్జాలు డెలివరీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News