: జగన్ రోడ్ షో కారణంగా ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్... రోగి మృతి


రాజకీయనేతలు నిర్వహించే రోడ్ షోల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. తాజాగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ అనంతపురం జిల్లాలో నిర్వహించిన రోడ్ షో కారణంగా ఓ రోగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జిల్లాలోని కూడేరులో జగన్ రోడ్ షో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్ లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో, కణేకల్ మండలం హనుమాపురానికి చెందిన పాపన్న అనే రోగి ఉన్నాడు. సకాలంలో చికిత్స అందకపోవడంతో అతడు బాధాకర పరిస్థితుల నడుమ ప్రాణాలు విడిచాడు.

  • Loading...

More Telugu News