: మదర్ ఔన్నత్యం మతాన్ని మించినది: మిషనరీస్ ఆఫ్ ఛారిటీ
సేవల ముసుగులో మదర్ థెరెస్సా మతమార్పిళ్లకు పాల్పడ్డారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఖండించింది. మతమార్పిళ్ల వ్యవహారంలోకి మదర్ థెరెస్సా పేరును లాగడం సరికాదని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రతినిధి సునీతా కుమార్ హితవు పలికారు. మదర్ ఔన్నత్యం మతాన్ని మించినదని, వాళ్లు (ఆర్ఎస్ఎస్) చేసిన వ్యాఖ్యలను ఎవరూ నమ్మబోరని ఆమె పేర్కొన్నారు. మానవ సేవ, శాంతి కోసం మదర్ పాటుపడ్డారని, అటువంటి వ్యక్తిపై మతమార్పిడి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు.