: కేసీఆర్ మొక్కులకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ


తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దేవుళ్లకు మొక్కుకున్నారు. ఇప్పుడు తన మొక్కులన్నీ తీర్చుకునే పనిలో ఆయన ఉన్నారు. కేసీఆర్ మొక్కుబడులు తీర్చేందుకు ప్రస్తుతానికి రూ. 59 లక్షలు కేటాయిస్తూ జీవో జారీ అయింది. ఈ నిధులతో వరంగల్ భద్రకాళి అమ్మవారికి 2 కిలోలతో బంగారు కిరీటం, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 15 గ్రాముల ముక్కుపుడక, విజయవాడ కనకదుర్గమ్మకు 15 గ్రాముల ముక్కుపుడక, కురవి వీరభద్రస్వామికి 25 గ్రాముల బంగారు మీసాలు చేయిస్తారు. దీనికితోడు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆభరణాలు చేయించేందుకు రూ. 5 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.

  • Loading...

More Telugu News