: మధ్యప్రదేశ్ గవర్నర్ పై ఎఫ్ఐఆర్


మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద ఎస్ టీఎఫ్ కేసు నమోదైంది. బోర్డు నిర్వహించిన ఓ పరీక్ష కింద ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో మోసం జరిగిందని ఎస్ టీఎఫ్ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రామ్ నరేష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన పదవిలో నుంచి దిగిపోవాలని కొన్ని రోజుల కిందట ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆందోళన కూడా చేశారు. ఈ స్కాంలో గవర్నర్ మనవడి హస్తం కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News