: షాపింగ్ చేసినట్టు ఆధారాలుంటే బయటపెట్టండి... రేణుకా చౌదరి సవాల్


తాను షాపింగ్ చేయడంవల్లే ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం 45 నిమిషాల పాటు ఆగిందంటూ జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. ఈ మేరకు స్పందించిన ఆమె, కావాలనే తనపై కొందరు బురద చల్లుతున్నారని ఆరోపించారు. తాను షాపింగ్ చేసినట్టు ఆధారాలుంటే బయటపెట్టాలని రేణుక సవాల్ విసిరారు. దానిపై విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కలుస్తానని, తనపై ఏవియేషన్ అధికారులు చెప్పినదాన్ని నిరసిస్తానని చెప్పారు. మరోవైపు విమాన ఆలస్యంపై ఎయిర్ ఇండియా యాజమాన్యం విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News