: జర్నలిస్టులకు రూ.10 కోట్లు... న్యాయవాదులకు రూ.100 కోట్లు: సంతకం చేసిన కేసీఆర్
తెలంగాణలో జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 కోట్లు, న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తూ కేసీఆర్ నిన్న ఫైలుపై సంతకం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జర్నలిస్టుల సంకేమానికి మరో రూ.10 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే, జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాల కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది.