: 32 లక్షల మంది నుంచి రూ.6380 కోట్లకు పైగా దోచుకున్న అగ్రిగోల్డ్


ప్రజలను మభ్యపెట్టి వారి నుంచి పెద్దమొత్తంలో నిధులను సమీకరించడమే లక్ష్యంగా సాగిన గోల్డ్ స్కీమ్స్ నిలువునా ముంచేశాయి. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ సంస్థలు ఖాతాదారుల నుంచి రూ.6,510 కోట్లకు పైగా వసూలు చేసినట్టు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వివరించారు. ఒక్క అగ్రిగోల్డ్ కేసులోనే 32 లక్షల మంది బాధితులు ఉన్నారని, వీరు రూ.6,380 కోట్ల మేరకు మోసపోయారని పేర్కొన్నారు. ఇక అభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ సైతం ఇదే తరహాలో ప్రజల నుంచి రూ.130 కోట్లు సేకరించినట్లు తమ విచారణలో వెల్లడైందని, బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News