: అనంతలో లారీని కొట్టేసిన దొంగలు... గంటల వ్యవధిలో పట్టేసిన పోలీసులు


అనంతపురంలో దొంగలు భారీ చోరీకి యత్నించారు. ఐరన్ లోడుతో వెళుతున్న ఓ లారీని చాకచక్యంగా తస్కరించారు. అయితే విషయాన్ని గుర్తించిన లారీ యజమాని వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు ‘భారీ’ చోరులకు అడ్డుకట్ట పడింది. వివరాల్లోకెళితే... ఐరన్ లోడుతో వెళుతున్న ఓ లారీని... ఆ వాహనం డ్రైవర్ ను మాయమాటల్లో ముంచేసి దొంగలు మాయం చేశారు. చాకచక్యంగా చేజిక్కించుకున్న ఐరన్ లోడ్ లారీ సహా ఎంచక్కా పరారయ్యారు. అయితే లారీ చోరీకి గురైందని గుర్తించిన డ్రైవర్ సమాచారాన్ని తన యజమానికి చేరవేశాడు. లారీ యజమాని నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే లారీని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. జిల్లా నుంచి లారీతో పరారవుతున్న దొంగలను తాటిచర్ల సమీపంలో పట్టేశారు.

  • Loading...

More Telugu News