: అన్నా హజారే దీక్షలో రేపు పాల్గొననున్న కేజ్రీవాల్


భూసేకరణ చట్టంపై బిల్లుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్షలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు పాల్గొననున్నారు. కేంద్రం తెస్తున్న భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నేటి నుంచి రెండు రోజులపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు ఆయన దీక్ష చేపట్టారు. రేపటి దీక్షలో కేజ్రీవాల్ పాల్గొంటారు. గతంలో జనలోక్ పాల్ బిల్లుపై వీరిద్దరూ కలిసి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ రాజకీయ రంగప్రవేశం తరువాత వీరిద్దరూ కలవలేదు. తాజాగా అన్నా దీక్షకు కేజ్రీ మద్దతు పలకడం విశేషం.

  • Loading...

More Telugu News