: టీడీపీని చూసి టీఆర్ఎస్ వణుకుతోంది: ఎర్రబెల్లి
టీడీపీని చూసి టీఆర్ఎస్ వణుకుతోందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో దొంగలు, లఫంగిలు చేరారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 3న కరీంనగర్ లో టీడీపీ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.