: టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి...మాదిగలకు చెక్!


టీడీపీ అధికార ప్రతినిధిగా జూపూడి ప్రభాకర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియమించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జూపూడిని, అనతి కాలంలోనే అధికార ప్రతినిధిగా నియమించడం విశేషం. ఇందులో బాబు రాజకీయ చతురత దాగుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా రిజర్వేషన్లపై మాదిగ సామాజిక వర్గం బాబును దుమ్మెత్తిపోస్తోంది. బాబు తెలంగాణ పర్యటనను అడ్డుకున్నది కూడా మాదిగ సామాజిక వర్గమేనని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో జూపూడి నియామకం ఆసక్తి రేపుతోంది. వైఎస్సార్సీపీలో ఉండగా సుమారు ప్రతిరోజూ బాబుపై విరుచుకుపడిన జూపూడిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం వెనుక అంతరార్థంపై రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News