: హాలీవుడ్ మారుతోందా?... డిజైనర్లలో భారతీయత వెల్లివిరుస్తోందా?
హాలీవుడ్ మారుతోందా?... అంతర్జాతీయ డిజైనర్లలో భారతీయత వెల్లివిరుస్తోందా? అంటే ఆస్కార్ అవార్డు ఉత్సవాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోందని హాలీవుడ్ అభిమానులు అంటున్నారు. భారతీయ సినీ ఉత్సవాల్లో పాశ్చాత్య వస్త్రధారణకే పెద్దపీట వేస్తారు సినీ నటీనటులు. చిట్టిపొట్టి గౌన్లతో, అందాల విందు చేస్తూ అభిమానుల మనసులు దోచుకుంటారు. అందుకు విరుద్ధంగా హాలీవుడ్ నటీమణులు ప్రవర్తిస్తున్నారు. నిండైన గౌన్లతో ఆస్కార్ ఫంక్షన్ కు హాజరయ్యారు. వీలైంత పొడుగాటి గౌన్లు ధరించిన హాలీవుడ్ హీరోయిన్లు అంతర్జాతీయంగా అభిమానులను, డిజైనర్లను ఆకట్టుకున్నారు. నిండైన వస్త్రధారణ భారతీయులు మర్చిపోతున్నప్పటికీ పాశ్చాత్య నటీమణులు మాత్రం భారతీయ సంప్రదాయాన్ని పాటించడం అందర్నీ ఆకట్టుకుంటోంది.