: రాష్ట్రపతి ప్రసంగం పాత చింతకాయ పచ్చడి: సోనియా
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నేటి ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ప్రణబ్ ప్రసంగం తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. యూపీఏ విధానాలకు కొద్దిపాటి మార్పులు చేసి వాటిని భాజపా సొంత విధానాలుగా ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఈ ప్రసంగం తమకు సంతృప్తిని కలిగించలేదని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.