: గోవా బీచ్ లలోని డ్యాన్సింగ్ బార్లను మూసేయండి... పర్సేకర్ సర్కారుపై బీజేపీ ఎమ్మెల్యే నిరసన


గోవాను పాలిస్తున్న బీజేపీ సర్కారుపై సొంత పార్టీ సభ్యుడే నిరసన గళం విప్పారు. రాష్ట్రంలోని బీచ్ లలో ఏర్పాటైన డ్యాన్సింగ్ బార్లను మూసేయాలని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మైఖేల్ లోబో నేడు నిరాహార దీక్షకు దిగారు. డ్యాన్సింగ్ బార్లలో మద్యం మత్తులో పురుషులు చేస్తున్న అల్లరి వల్ల సమీపంలోని మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అంతేకాక డ్యాన్సింగ్ బార్ల కారణంగా మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని మైఖేల్ లోబో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన యశ్వంత్ పర్సేకర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చట్ట విరుద్ధంగా బార్లను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News