: వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ బోణి... 119 పరుగుల తేడాతో స్కాట్లాండ్ పై విజయం


ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ బోణీ చేసింది. పసికూన స్కాట్లాండ్ పై 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో 304 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 42.2 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కైలీ కొయెట్జర్ (77) అర్ధ సెంచరీలో ఒంటరి పోరు సాగించాడు. అయినా ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 303 పరుగులు చేసింది. ఓపెనర్లు మొయిన్ అలీ (128) సెంచరీతో, ఇయాన్ బెల్ (52) అర్ధ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. మెగా టోర్నీలో తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో జరిగిన మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ మట్టికరచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News