: పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి, ప్రధాని
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు మీడియానుద్దేశించి ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. అనంతరం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయనకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఆయనను తోడ్కొని సభలోకి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు.