: నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... తెలుగు రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ వచ్చేనా?


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం తమకు ప్రత్యేక హోదా దక్కుతుందా? లేదా? అన్న విషయంపై దృష్టి సారించాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు విభజన చట్టమే చెబుతోంది. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ విషయంపై దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో గళమెత్తి ఎలాగైనా సాధించాలని ఏపీ ఎంపీలు భావిస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఇతర అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని టీడీపీ, వైసీపీ తమ తమ సభ్యులకు సూచించాయి. మరోవైపు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో గళం విప్పనున్నారు. తెలంగాణకూ ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు.

  • Loading...

More Telugu News