: కాంగ్రెస్ ఉనికి కోసం వివాదాలు రేపుతోంది: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకే ఏదో ఒకటి మాట్లాడుతోందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఉందని ప్రజలకు గుర్తు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వివాదం రేపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. వారు ఎంత గొంతు చించుకున్నప్పటికీ ప్రజలు వారిని పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి నిధులు, రాయితీలు, ప్రయోజనాలు వచ్చేలా చూస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఆలోచిస్తోందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదాపై ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని ఆయన తెలిపారు. గతంలో కంటే 30శాతం అధిక నిధులను కేటాయిస్తామని చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఈ సారి బడ్జెట్ లో శాస్త్ర, సాంకేతిక రంగానికి అదనపు నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు.