: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్...రేపే నామినేషన్


హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన దేవీప్రసాద్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్జీవో అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన దేవీ ప్రసాద్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారని భావించారు. ఆయనకు అప్పట్లో టికెట్ రాకపోవడంతో నిరాశ చెందారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు మొండిచెయ్యి చూపినప్పటికీ తాజాగా ఆయనను పట్టభద్రుల ఎన్నికల నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన రాజకీయ రంగప్రవేశం పూర్తయింది.

  • Loading...

More Telugu News