: జగ్గయ్యపేటలో వెలుగు చూసిన రియల్ మోసం...తిరగబడ్డ బాధితులు


కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రియల్ మోసం వెలుగు చూసింది. రాజధాని వస్తుందంటూ హడావుడి చేసి, వెంచర్ చేస్తున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ కుమార్ 200 మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ధనంబోర్డ్ లోని హిల్ టాప్ వెంచర్ పేరిట ఓ ప్రాంతాన్ని చూపించిన ఆయన ఎవరి ప్లాటు ఏది? అని చెప్పకుండా నెట్టుకొస్తున్నాడు. దీంతో డబ్బులు చెల్లించిన వారంతా హిల్ టాప్ వెంచర్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో విజయకుమార్ అనుచరులు వారిపై దాడికి దిగారు. వారిని అడ్డుకున్న బాధితులు ఆగ్రహించి, ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News