: టాపార్డర్ అవుట్... విజయం దిశగా భారత్
భారత జట్టు విజయం దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఉత్తమ ప్రదర్శన చేస్తోంది. దీంతో కేవలం 34 ఓవర్లలో సౌతాఫ్రికా టాపార్డర్ ను అవుట్ చేసిన టీమిండియా విజయం దిశగా సాగుతోంది. డివిలీర్స్, డుప్లెసిస్, అవుటైన తరువాత సఫారీ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతుండగా, మిల్లర్ (22) ను ఉమేష్ యాదవ్ అద్భుతమైన త్రో చేయగా ధోనీ రన్ అవుట్ చేశాడు. అనంతరం డుమిని (6)ని అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం పార్నెల్ కు జతకలిసిన ఫిలాండర్ ను కూడా అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 34 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాజట్టు కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది.