: ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వస్తుంది: మురళీ మోహన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంటులో అఖిల పక్షం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నింటిపైనా కేంద్రానికి సూచనలు చేస్తున్నామని, ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా సాధించుకుంటామని అన్నారు. నిధుల లేమితో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ వస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రణాళికలు రచించారని ఆయన పేర్కొన్నారు. రాజధాని, పోలవరం నిధులు వంటివన్నీ కేంద్ర బడ్జెట్ లో చోటుచేసుకోనున్నాయని ఆయన వెల్లడించారు.