: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని... ప్రియుడితో కలసి భర్తను లేపేసింది


వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించినందుకు ఆ భర్త హత్యకు గురయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం కోనాపూర్ లో రాజు(28) గత కొంతకాలంగా భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజు భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది రాజు దృష్టికి రావడంతో సంసారాన్ని అల్లరి చేసుకోవడం ఇష్టం లేని రాజు, ప్రవర్తన మార్చుకోవాలంటూ భార్యను పదే పదే హెచ్చరించేవాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి గతరాత్రి భర్తను హత్య చేసింది. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఆమె విషయం తెలిసిన గ్రామస్థులు, ప్రియుడితో కలిసి భార్యే రాజును చంపేసిందని ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News