: టీఆర్ఎస్ లో చేరిన సినీ హీరో


'ఆనందం' సినిమాతో తెలుగు సినీ అభిమానులను అలరించిన హీరో ఆకాశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఫిలింఛాంబర్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో ఆయన 'కారు' ఎక్కారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, భారతదేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్ స్థానంలో ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం తెలంగాణ అని చెప్పిన ఆయన, అమెరికా తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని సినీ నిర్మాణం కోసం తీసుకురావాలని సూచించారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన వెల్లడించారు. నిర్మాతలందరినీ ఒక్కచోట చేర్చి సినిమా టౌన్‌ షిప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News