: రెండు పడవలు ఢీ...ప్రయాణికుల పడవ మునక


బంగ్లాదేశ్ లోని పద్మానదిలో రెండు పడవలు ఢీకొట్టుకున్నాయి. సరకులతో వస్తున్న ఓ పడవ, ప్రయాణికులతో వస్తున్న మరో పడవను ఢీకొట్టింది. కార్గో పడవలో సామగ్రి ఉండగా, మరో పడవలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగంగా వచ్చిన కార్గో పడవ ఢీ కొట్టడంతో ప్రయాణికుల పడవ మునిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులను రక్షించారా? లేదా? ప్రాణహాని ఎంత? అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సహాయకచర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News