: భూసేకరణ బిల్లుకు మద్దతివ్వండి: సోనియాతో వెంకయ్య భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 10 జనపథ్ లోని సోనియా నివాసానికి వెళ్లిన వెంకయ్యనాయుడు ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించనున్న పలు అంశాలపై ఆమెతో ముచ్చటించారు. బడ్జెట్ లో ప్రస్తావించే ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సోనియాకు తెలిపారు. భూసేకరణ బిల్లు భావోద్వేగానికి సంబంధించినదని తెలిపిన ఆయన, రాజకీయాలకు అతీతంగా సమస్య పరిష్కరిద్దామని సూచించారు. కాగా, భూసేకరణ బిల్లుపై రెండు రోజుల ధర్నాకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News