: నేటి నుంచి జగన్‌ రైతు భరోసా యాత్ర


వైకాపా అధినేత వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అనంతపురం జిల్లాలోని కొడికొండ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ సాయంత్రం హిందూపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రైతు భరోసా యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ యాత్రలో భాగంగా, రాష్ట్ర రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నాన్ని ఆయన చేయనున్నారు. కాగా, రైతు భరోసా యాత్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని తెలుగుదేశం నేతలు విమర్శించారు.

  • Loading...

More Telugu News