: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కి అనుకోని అతిథి!


క్రికెట్ ఆటగాడిగా ఆరు ప్రపంచకప్‌ లు ఆడిన అపార అనుభవం ఉన్న సచిన్ టెండూల్కర్ తొలిసారిగా స్టాండ్స్ లో కూర్చొని సందడి చేయనున్నారు. నేడు దక్షిణాఫ్రికాతో జరగనున్న క్రికెట్ పోటీలో భారత జట్టును ఉత్సాహపరచేందుకు అతిథిగా ఆయన అడుగు పెట్టనున్నాడు. ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్‌ గా కూడా వ్యవహరిస్తున్న టెండూల్కర్ నిన్ననే మెల్‌బోర్న్ చేరుకున్నాడు. ఇన్నాళ్లూ డ్రెస్సింగ్ రూములో ఉన్న ఈ లెజెండ్, తొలిసారి ప్రపంచకప్‌ ను ప్రేక్షకులతో కలసి వీక్షించనుండడం విశేషం. ఈ మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ తర్వాత విరామం సమయంలో గూగుల్ ప్లస్ హ్యాంగౌట్ ద్వారా సచిన్ అభిమానులతో చాట్ చేసేలా ఐసీసీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News