: ప్రేమించి పెళ్లి చేసుకుని ఉరేసుకున్నారు!
ప్రేమించి ఎన్నో కలలతో పెళ్లి చేసుకుని రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఆత్మహత్యకు పాల్పడ్డ నవదంపతులు రెండు కుటుంబాలను విషాదంలో ముంచేశారు. కడప పట్టణంలోని మట్టిపెద్దపులి వీధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ వీధిలో విషాదం నెలకొంది. ప్రేమ వివాహం చేసుకున్న రెండు నెలలకే వీరు ఆత్మహత్యకు పాల్పడడం పలువుర్ని కలచి వేస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.