: నాకు మూడోస్థానమే కరెక్టు: కోహ్లీ
మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే తనకు సరైనదని టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా-భారత్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విరాట్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ప్రపంచకప్ లో తనను అదే స్థానంలో ఆడించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నానని తెలిపాడు. ప్రపంచకప్ ముందు కూడా అదే స్థానంలో బ్యాటింగ్ చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించిన విషయం గుర్తు చేశాడు. రేపటి మ్యాచ్ లో విజయం దిశగా మెరుగైన ప్రదర్శన చేస్తామని కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ లో సఫారీ కీలక బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉపయోగపడుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.