: మన బ్యాటింగ్, వాళ్ల బౌలింగ్ మధ్యనే పోటీ: కోహ్లీ


రేపు దక్షిణాఫ్రికాతో మెల్ బోర్న్ లో జరిగే పోటీలో భారత బ్యాటింగ్, సఫారీల బౌలింగ్ మధ్యనే ప్రధాన పోటీ అని టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సఫారీ జట్టులో మంచి బౌలర్లు భారత జట్టులో బ్యాటింగ్ లైన్ అప్ పటిష్టంగా ఉందని అన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్ తదితరులతో ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఇండియాకు కలసి వస్తుందని అన్నాడు. డేల్ తనకు మంచి మిత్రుడని, మైదానంలో మాత్రం ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికే యత్నిస్తామని చెప్పాడు. మెల్ బోర్న్ మైదానానికి వచ్చే 80 వేల మంది ప్రేక్షకుల్లో 80 శాతం భారతీయ అభిమానులే ఉండటం అనుకూలించే అంశమని అన్నాడు.

  • Loading...

More Telugu News