: కాలుష్యం నిజంగానే పెరిగిందా? లేక అమెరికా పెంచుతోందా?


ప్రపంచంలోని వాయుకాలుష్యం కలిగిన దేశాల్లో నెంబర్ వన్ భారతదేశానిదేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వాయుకాలుష్యం కారణంగా భారతీయుల్లో ఆయుష్షు క్షీణిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. భారత్ లో సగం జనాభా వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని పలు సర్వేల్లో వెల్లడైందని వివరించింది. కాలుష్యం కారణంగా భారత్ లో సగం జనాభా తమ జీవితకాలంలో దాదాపు మూడేళ్ల రెండు నెలల జీవిత కాలాన్ని నష్టపోతున్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వెల్లడించిన ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య కారక నగరాల్లో 13 భారత్ లోనే ఉన్నాయని సర్వే చెబుతోంది. ఈ నగరాల్లో ఢిల్లీ కూడా ఉండడం విశేషం. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కాలుష్య నియంత్రణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. కాగా, వారం రోజుల క్రితం చైనాలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని, కాలుష్యం తగ్గించుకునేందుకు తాము సహాయం చేస్తామని అమెరికా ప్రకటించినప్పడు కూడా ఇలాంటి వార్తలే రావడం, వాటిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడం, అమెరికా సహాయం నిరాకరించడం జరిగింది. రెండు రోజుల క్రితం భారత్ లో కాలుష్య నియంత్రణకు సహాయసహకారాలు అందిస్తామని, అందుకోసం ఒప్పందాలు చేసుకుంటామని అమెరికా భారత్ కు స్నేహహస్తం చాచింది. అమెరికా ప్రకటించిన రెండు రోజులకే డబ్ల్యూహెచ్ఓ భారత్ లో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరిందని ప్రకటించడం విశేషం.

  • Loading...

More Telugu News