: పాక్ ప్రేరేపిత మిలిటెంట్లతో కొనసాగుతున్న ఎన్ కౌంటర్


జమ్మూకాశ్మీర్‌ లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలోని తక్‌గండ్ గ్రామంలో మిలిటెంట్లు ఉన్నారన్న సమచారం అందుకున్న పోలీసులు, భద్రత సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారిపై దాడి చేసే సమయంలో, వీరిని గమనించిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. దీనికి సమాధానంగా భద్రత దళాలు కూడా కాల్పులు జరిపాయి. గడచిన రెండు గంటల నుంచి ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News