: ఏపీకి ప్రత్యేక హోదా అడిగేందుకు చంద్రబాబుకు ధైర్యం లేదు: తెలంగాణ మంత్రి తలసాని
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ మాజీ నేత, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మరోమారు ఫైరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగేందుకు చంద్రబాబుకు ధైర్యం లేదని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, అవసరమైన మేర నిధుల కోసం కేంద్రాన్ని అడిగేందుకు చంద్రబాబు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదని తలసాని వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు, తన కుటుంబ ఆస్తులను సరిచూసుకోవాలని తలసాని ఎద్దేవా చేశారు.