: ఇంకెవరూ చేయని సరికొత్త 'చెత్త' రికార్డు సృష్టించిన పాకిస్తాన్


నేడు వెస్టిండీస్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ఓ కొత్త రికార్డును పాకిస్తాన్ జట్టు నమోదు చేసింది. ఘోరంగా ఓడిపోయిన జట్టు కొత్త రికార్డు సృష్టించడం ఏంటి అనుకుంటున్నారా... అదో సరికొత్త 'చెత్త' రికార్డు. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ ఆరంభంలో ఒక్క పరుగుకే 4 వికెట్లు కోల్పోయింది కదా? వన్డే క్రికెట్ చరిత్రలో ఒక జట్టు 4 వికెట్ల నష్టానికి చేసిన స్కోర్లలో ఇదే అతి తక్కువ. అంతకుముందు ఈ చెత్త రికార్డు కెనడా పేరిట ఉండేది. 2006లో జింబాబ్వేతో జరిగిన ఒక మ్యాచ్ లో కెనడా 4 వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. తాజాగా పాకిస్తాన్ అంతకంటే చెత్తగా ఆడి చిత్తుగా ఓడి, 4 వికెట్ల నష్టానికి అతి తక్కువ స్కోరు చేసిన జట్టుగా మిగిలింది.

  • Loading...

More Telugu News