: ఢిల్లీలో మరో ఘోరం... కదులుతున్న కారులో విదేశీ మహిళపై అత్యాచారం


నైజీరియా దేశానికి చెందిన 35 సంవత్సరాల మహిళను కారులో ఎక్కించుకొని ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఒకరి తరువాత ఒకరుగా నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం డీఎన్డీ టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో వున్న ఆ మహిళను నిర్దయగా రోడ్డుపై పడేసి వెళ్లారు. ఈ ఘటన ఢిల్లీలో మరో 'నిర్భయ'ను గుర్తు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో టోల్ ప్లాజా ఉద్యోగులు తెలివిలేకుండా పడివున్న మహిళను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు టోల్ ప్లాజా, ఆ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి కేసు నమోదు చేశారు. హ్యుందాయ్ యాక్సెంట్ కారులో వచ్చిన నలుగురు ఆమెను కారు నుంచి వదిలి పరారయ్యారు. వీరు 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారని గుర్తించిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి రిమాండ్ కు పంపినట్టు తెలిపారు. కాగా, గత సంవత్సరం మొత్తం 2,069 అత్యాచార కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News