: మోదీ సర్కారుకు అనుకూలం కాదు...అలాగని వ్యతిరేకమూ కాదు: తెలంగాణ సీఎం కేసీఆర్


నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో టీఆర్ఎస్ చేరనున్నట్లు వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టలేదు. మోదీ సర్కారుకు తాము అనుకూలం కాదని ప్రకటించిన ఆయన అదే సమయంలో వ్యతిరేకమూ కాదని చెప్పారు. నిన్నటి మీడియా సమావేశంలో భాగంగా కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందన్న వార్తలపై మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు స్పందించిన కేసీఆర్, ఈ విషయంలో తాము ఇప్పటిదాకా కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ప్రకటించారు.

  • Loading...

More Telugu News