: సింగిల్ పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్... ఓటమి దిశగా పయనం
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో చిర్రెత్తిస్తోంది. వెస్టిండిస్ తో నేటి తెల్లవారుజామున ప్రారంభమైన మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ చేజార్చుకున్న పాక్, ఆ తర్వాత ఒక్క పరుగు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే పాక్ ఓపెనర్ నాసిర్ జంషెడ్ డకౌటయ్యాడు. ఆ తర్వాత అహ్మద్ షెహ్ జాద్ ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన పాక్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్, హ్యారిస్ సోహైల్ లు ఖాతా తెరవకుండానే వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో తొలి ఒవర్ లో ఒకే ఒక్క పరుగుకు రెండు వికెట్లను చేజార్చుకుని ఆ తర్వాతి రెండు ఓవర్లలో పరుగులేమీ రాబట్టకుండానే మరో రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో ఒక్క పరుగు స్కోరుకే పాక్ నాలుగు వికెట్లను కోల్పోయినట్లైంది. ప్రస్తుతం తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కేవలం 17 పరుగులు చేసింది.