: ట్విట్టర్ చర్చలన్నీ కోహ్లీ చుట్టేనట... భారత్, పాక్ ఆటగాళ్లపైనే మెజారిటీ చర్చలు
విరాట్ కోహ్లీ... వైస్ కెప్టెన్ హోదాలో టీమిండియాకు టన్నుల కొద్దీ పరుగులు సాధించి పెడుతున్న క్రికెటర్. తాజాగా అతడు మరో ఘనతను సాధించాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో అత్యధిక మంది చర్చిస్తున్న వరల్డ్ కప్ ప్లేయర్ గా అతడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో భాగంగా గతంలోనూ భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల గురించిన చర్చే ఎక్కువట. తాజాగా ఈ ఏడాది కూడా ఈ దేశాల ఆటగాళ్లపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే పాక్ క్రికెటర్లనే కాక టీమిండియా స్టార్ ప్లేయర్లందరి కంటే కోహ్లీ గురించిన ట్వీట్లే అధికంగా కనిపిస్తున్నాయట. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ హెరాల్డ్ ఈ విషయాన్ని వెల్లడించింది.