: రాజధాని నిర్మాణానికి మే రెండో వారంలో భూమి పూజ: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మే రెండో వారంలో భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, సింగపూర్ ప్రభుత్వం మే నెల మొదటి వారంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇవ్వనుందని అన్నారు. సింగపూర్ ప్లాన్ ఇవ్వగానే దానిని పరిశీలించిన అనంతరం రెండో వారంలో తుళ్లూరులో భూమి పూజ చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగుల తరలింపులో ఇబ్బందులున్న దృష్ట్యా తాత్కాలిక రాజధాని వ్యవహారాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టామని ఆయన వెల్లడించారు. తాత్కాలిక రాజధాని కాకుండా శాశ్వత రాజధానినే నిర్మిస్తామని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుందని నారాయణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News