: బీహార్ సీఎంగా నితీశ్ కుమార్... ఈ నెల 22న ప్రమాణస్వీకారం
జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ కల నెరవేరుతోంది. మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తానుగా తప్పుకోవడంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ అలంకరించబోతున్నారు. కొద్దిసేపటి కిందట గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలసిన నితీశ్, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తమను ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ అనుమతించి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో ఈ నెల 22న అంటే ఆదివారం సాయంత్రం 5 గంటలకు నితీశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.