: అమర్త్యసేన్ పదవీకాలం తగ్గించే ప్రయత్నం లేదు: కేంద్రం


నలంద విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రముఖ ఆర్థికవేత్త, నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తనని ఆ పదవిలో కొనసాగించాలని కేంద్రానికి ఇష్టం లేదేమోనన్న సేన్ వ్యాఖ్యలను ఖండించింది. పదవీకాలన్ని తగ్గించే ఎలాంటి ప్రయత్నం లేదని సర్కారు స్పష్టం చేసింది. కాగా సేన్ పదవీకాలం పొడిగించి వీసీగా కొనసాగించాలని పాలకమండలి ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదించింది. దీనిపై నెలరోజులు గడిచినప్పటికీ ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో ఈ రోజు సేన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News